విక్రమ్ తో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం : తమన్నా
- విక్రమ్ హీరోగా రెడీ అవుతోన్న 'స్కెచ్'
- ఆయన జోడీ తమన్నా
- అంకితభావం కలిగిన గొప్ప నటుడు విక్రమ్
- ఆయన క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు
విక్రమ్ ఎప్పుడూ విలక్షణమైన పాత్రలనే ఎంచుకుంటాడనీ, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రాణం పెడతాడని అంది. ఎలాంటి వాతావరణంలోనైనా కరెక్ట్ టైమ్ కి షూటింగుకి వచ్చేస్తాడనీ, ఆయన క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని చెప్పింది. ఆయనని అభిమానులు ఎందుకు అంతలా అభిమానిస్తారనే విషయం తనకి అర్థమైందని అంది. అలాంటి విక్రమ్ తో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.