అల్లరి నరేశ్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు!
- నిరాశ పరిచిన 'మేడమీద అబ్బాయి'
- తదుపరి సినిమాపై దృష్టి పెట్టిన అల్లరి నరేష్
- దర్శకుడిగా సత్తిబాబు
- త్వరలో సెట్స్ పైకి
ఈ నేపథ్యంలో ఈ సారి హిట్ కొట్టాల్సిందే అనే గట్టి పట్టుదలతో ఆయన రంగంలోకి దిగుతున్నాడు. తాజాగా ఆయన దర్శకుడు సత్తిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'యముడికి మొగుడు' .. 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రాలు నరేశ్ అభిమానులను అలరించాయి. ప్రస్తుతం మంచు విష్ణుతో 'ఓటర్' సినిమాను నిర్మిస్తోన్న వారే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇక అల్లరి నరేశ్ ఆశలన్నీ సత్తిబాబు సినిమాపైనే ఉన్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్.