`రోబో 2.0`లో రజనీ పాత్రను ఆమిర్ ఖాన్ చేయాల్సిందట!... వెల్లడించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
- ఆమిర్‌కి కాల్ చేసిన రజనీ
- స్క్రిప్ట్ కూడా చదివిన ఆమిర్
- రజనీని ఎవరూ భర్తీ చేయలేరని అవకాశం వదులుకున్న ఆమిర్
`రజనీ సార్ కి, శంకర్‌కి నేను పెద్ద అభిమానిని. `రోబో 2.0`లో రజనీ పాత్ర చేయాలని శంకర్ నన్ను అడిగారు. అది పెద్ద హిట్టవుతుందని నాకు తెలుసు. అనారోగ్యం కారణంగా తాను సినిమా చేయలేనని ఆమిర్‌ను అడగాలని ఆయన శంకర్‌తో చెప్పారు. దాని గురించి రజనీ సార్ నాకు కాల్ కూడా చేశారు. `రోబో` సినిమా చూడటం వల్లనో లేక నేను ఆయన అభిమాని కావడం వల్లనో... స్క్రిప్ట్ చదువుతున్నపుడు నాకు ఆయన మాత్రమే కనిపించేవారు. ఆయన పాత్రలో నన్ను నేను ఊహించుకోలేకపోయా. దీంతో ఆ స్థానంలో రజనీ సార్‌ని ఎవ్వరూ భర్తీ చేయలేరని శంకర్‌తో చెప్పాను` అని ఆమిర్ చెప్పాడు.