సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- స్టార్ ఇమేజ్ పై తాప్సీ మదిలో సందేహం
- 'సువర్ణ సుందరి' పాత్రలో జయప్రద
- 'నెక్స్ట్ నువ్వే' సెన్సార్ పూర్తి
- నవంబర్ 3న నయనతార 'కర్తవ్యం'
* ప్రముఖ నటి జయప్రద ప్రధాన పాత్రదారిగా 'సువర్ణ సుందరి' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇది చారిత్రాత్మక కథతో తెరకెక్కుతోందని చిత్ర దర్శకుడు సూర్య తెలిపారు. ఇందులో యువనటి పూర్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
* ఆది సాయికుమార్ హీరోగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన 'నెక్స్ట్ నువ్వే' చిత్రం సెన్సార్ పూర్తయింది. చిత్రాన్ని నవంబర్ 3న దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వైభవి, రష్మి హీరోయిన్లుగా నటించారు.
* నయనతార తమిళంలో నటించిన 'ఆరం' చిత్రాన్ని తెలుగులోకి 'కర్తవ్యం' పేరిట అనువదించారు. తెలుగు, తమిళ వెర్షన్లను నవంబర్ 3న ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నయన్ జిల్లా కలెక్టర్ గా నటించింది.