మళ్లీ పెళ్లి కావాలంటే 'పీకే సార్'నే చేసుకోండి!: రేణూదేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ సలహా
- సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేసిన రేణు దేశాయ్
- పవన్ అభిమానులు సంకుచితమా? అంటూ ఆగ్రహం
- పవన్ కల్యాణ్ నే మనువాడాలంటూ సూచనలు
- అదే జరిగితే ఆనందిస్తామంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
ఇక పవన్ అభిమానులైతే మరో అడుగు ముందుకు వేసి, మళ్లీ పెళ్లి కావాలంటే 'పీకే (పవన్ కల్యాణ్) సార్' నే చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అదే జరిగితే అత్యధికంగా ఆనందించేది తామేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ రేణును తిరిగి తీసుకురావాలని కూడా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.
రేణూ దేశాయ్ ఎప్పుడు మాట్లాడినా, ఆమె మాటల్లో పవన్ పై ఉన్న ప్రేమ కనిపిస్తూనే ఉంటుందని, ఎంతో ఒంటరితనం అనుభవించిన తరువాతే, ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని, ఆమెను బాధించేలా కామెంట్లు పెట్టవద్దని మరికొందరు తోటి అభిమానులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.