'క్వీన్' రీమేక్ కోసం తమన్నా ఎదురుచూపులు!
- తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'క్వీన్' రీమేక్
- తెలుగు 'క్వీన్' కి దర్శకుడిగా నీలకంఠ
- కథానాయికగా తమన్నా
- షూటింగ్ మొదలయ్యే సమయం కోసం తమన్నా ఎదురు చూపులు
తాజాగా ఈ సినిమాను గురించి తమన్నా మాట్లాడింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో నటించడమంటే తనకి ఎంతో ఇష్టమనీ, 'క్వీన్' రూపంలో అది తనకి వచ్చిందని చెప్పింది. నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమా చేయనుండటం ఆనందంగా ఉందని అంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. హిందీలో 100 కోట్లకిపైగా తెచ్చిపెట్టిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.