నెక్స్ట్ మూవీ నానితోనే అంటోన్న డైరెక్టర్!
'భీమిలీ కబడ్డీ జట్టు' .. 'శంకర' వంటి సినిమాలు చేసిన సత్య .. 'వీడెవడు'తో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెక్స్ట్ మూవీ నానితో చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పాడు. కథ కూడా రెడీగా ఉందనీ .. త్వరలోనే నానికి వినిపిస్తానని అన్నాడు. నానికి కథ నచ్చితే సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం తీసుకోనని చెప్పాడు. గతంలో సత్యతో 'భీమిలీ కబడ్డీ జట్టు' చేసిన నానీకి .. ఇప్పటి నానికి క్రేజ్ పరంగా చాలా తేడా వుంది. మరి ఆయన ఏమంటాడో చూడాలి.