చిరంజీవి విడుదల చేసిన 'ఇంద్రసేన' ఫస్టులుక్!
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. తనకి ఎంతో ఆప్తురాలైన రాధిక నిర్మిస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని కథానాయకుడిగా తన సత్తా చాటుకున్నాడనీ, ఈ సినిమాకి ఆయన ఎడిటింగ్ కూడా చేస్తుండటం విశేషమని అన్నారు. ఆయన ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.