కూతురుతో కలిసి 'వివేగం' చూసిన కమల్!
అజిత్ .. కాజల్ జంటగా నటించిన ఈ సినిమాలో అక్షర హాసన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె నటన ఎలా వుందో చూడాలనే ఆసక్తితో, ఈ రోజు ఉదయాన్నే కూతురును వెంటబెట్టుకుని కమల్ తొలి ఆటకు వెళ్లారు. ఈ సినిమా చూసి వచ్చిన తరువాత ఆయన ఈ విషయాన్ని గురించి ట్వీట్ చేశారు. కూతురు అక్షర హాసన్ ను మెచ్చుకుని ఆమెను ప్రోత్సహించినట్టు, ఈ సినిమా టీమ్ లోని వాళ్లందరికీ అభినందనలు తెలియజేసినట్టు సమాచారం.