బాలకృష్ణ మూవీ షూటింగులో నయనతార!
గతంలో బాలకృష్ణ .. నయనతార కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. ' శ్రీరామ రాజ్యం' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ కారణంగా మళ్లీ నయనతారను ఎంపిక చేసుకున్నారు. తమిళ .. మలయాళ భాషల్లో బిజీగా వున్న నయనతార, ఈ సినిమా కోసం పారితోషికంగా భారీ మొత్తమే తీసుకుందనే టాక్ వినిస్తోంది. బాలకృష్ణ సినిమా తరువాత ఆమె చిరంజీవితో చేయనుండటం విశేషం .