శంకర్ దర్శకత్వంలో వెండితెరపై సీఎంగా రజనీకాంత్?
తమిళ నాట రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి భారీస్థాయిలో రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'ముదల్వన్' వంటి కథతో జనాల్లోకి వెళ్లవలసిన అవసరాన్ని రజనీ గుర్తించారట. దాంతో శంకర్ రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు. రజనీ గుణ గణాలు .. ఆయన సీఎం అయితే ఎలా వుంటుందనే విషయాన్ని ముందుగా జనానికి తెలియజేసే ప్రయత్నంగా ఈ సినిమాను గురించి చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తుండటం విశేషం.