రానా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు: సురేశ్ బాబు
ఆ ఆలోచన రావడంతో విలన్ గా రానా తన సత్తా నిరూపించుకున్న తరువాత, హీరోగా స్టార్ డమ్ ను సంపాదించుకోవచ్చని అనుకున్నానని సురేశ్ బాబు చెప్పారు. ఈ కారణంగానే 'బాహుబలి'లో విలన్ పాత్ర చేయమని రానాను ప్రోత్సహించానని అన్నారు. అనుకున్నట్టుగానే 'బాహుబలి'లో విలన్ గా మార్కులు కొట్టేసిన రానా, ఆ క్రేజ్ తో హీరోగా విభిన్నమైన పాత్రలను చేస్తూ తాను ఆశించిన దిశగా అడుగులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు.