'వైశాఖం' రెస్పాన్స్ పట్ల దర్శక నిర్మాతల ఆనందం!
విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ రోజున హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ .. కథపై నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించామనీ .. తాము అనుకున్నట్టుగానే యూత్ కి బాగా కనెక్ట్ అయిందని అన్నారు. హరీశ్ .. అవంతిక కొత్త వాళ్లైనా మంచి ప్రతిభను కనబరిచారని చెప్పారు. టీమ్ సహకారంతోనే ఈ సక్సెస్ ను సాధించామంటూ .. ఆదరిస్తోన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.