తేజు మూవీ టైటిల్ 'దుర్గ' కాదంటోన్న వినాయక్!
ఈ ప్రచారాన్ని గురించి తాజాగా వినాయక్ స్పందిస్తూ, ఈ సినిమాకి ఇంకా తాము ఏ టైటిల్ అనుకోలేదని చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పైనే దృష్టి పెట్టామనీ, అది పూర్తయిన తరువాత టైటిల్ ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. తన సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో వుంటాయని చెప్పాడు. ఇప్పటికే చిరంజీవి .. చరణ్ .. అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన వినాయక్, తాజాగా సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తుండటం విశేషం.