'గర్జనై' కోసం అడవుల్లో పరుగులు తీస్తోన్న త్రిష!
రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఛేజింగులు .. అడవుల్లో పరుగులు ఒక రేంజ్ లో ఉంటాయనీ .. ఈ ఫోటో అందుకు సంబంధించినదేనని త్రిష చెబుతోంది. కథా కథనాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని అంటోంది. సాంకేతికపరంగా ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చెబుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.