నవంబరు 13న 'డానీ' చిత్రం విడుదల
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించి చిత్రం ‘డానీ’. ఈ మూవీలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ అందరినీ ఆకట్టుకుంది. రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ఈ ఫస్ట్ స్ట్రైక్ ట్రేడ్ సర్కిల్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ప్రేమకు, అలవాటుకు మధ్య ఉండే సంఘర్షణతో ఈ చిత్రాన్ని కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కించారు.
జీవితంలో ఓ వ్యక్తికి ఉన్న అలవాట్లు ఏంటి? ఆ అలవాట్ల కారణంగా ఎలాంటి స్థితికి వెళ్లాడు.. ప్రేమలో పడ్డాక జీవితం ఎలా మారింది.. ఆ అలవాట్లకు, ఈ ప్రేమకు మధ్య ఏర్పడిన సంఘర్షణ ఏంటి? అన్నది ‘డానీ’ చిత్రంలో చూపించబోతోన్నారు. ‘నాటకం’ చిత్రంతో కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌పై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు అయితే ఉంటాయి. ఆ అంచనాల్ని మించేలా ఈ ‘డానీ’ సినిమా ఉండబోతోంది. ఈ మూవీని నవంబర్ 13న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ మేరకు వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. హీరో, హీరోయిన్లు పోస్టర్ మీద ఉన్న తీరు, ఆ పోస్టర్ డిజైన్ తీరు ఇలా అన్నీ కూడా కథను ప్రతిబింబించేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను నవంబర్ 13న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.