వెవర్స్ కాన్ ఫెస్టివల్ ఇండియా తొలి ఎడిషన్‌లో గ్లోబల్ K-పాప్ స్టార్స్, భారతీయ సంగీత కళాకారుల సందడి!
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న K-పాప్ సంగీతాన్ని భారతీయ సంగీత అభిమానులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో Weverse Con Festival India తన తొలి ఎడిషన్‌కు సంబంధించిన కళాకారుల జాబితాను ప్రకటించింది. K-పాప్‌తో పాటు భారతీయ సంగీత రంగానికి చెందిన ప్రముఖ కళాకారులు ఒకే వేదికపై సందడి చేయనున్న ఈ రెండు రోజుల సంగీత వేడుక 2027 మార్చి 27, 28 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. కొరియా వెలుపల తొలిసారిగా నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ అంతర్జాతీయ సంగీత రంగంలో కీలకంగా నిలవనుంది.
ఈ ఫెస్టివల్లో Bumzu, Dayoung, ENHYPEN, Eric Nam, Hwasa, KATSEYE గ్లోబల్ గర్ల్ గ్రూప్‌కు చెందిన Lara, Lee Hyun, LE SSERAFIM, Rhea Raj, TOMORROW X TOGETHER సహా పలువురు అంతర్జాతీయ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. భారతీయ సంగీత రంగం నుంచి Gini, King, RANJ X Clifr, Reble, DJ Zelo ఈ సంగీత వేడుకలో భాగం కానున్నారు. విభిన్న తరాలకు చెందిన కళాకారులు, సంగీత శైలులు, ప్రత్యేకమైన ప్రదర్శనల సమ్మేళనంగా ఈ ఫెస్టివల్ రూపుదిద్దుకోనుంది.
ఈ కార్యక్రమాన్ని HYBE INDIA, BookMyShow Live సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఫెస్టివల్ ప్రారంభమైనప్పటి నుంచి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న HYBE, Weverse సంస్థలు కూడా ఈ భారతీయ ఎడిషన్‌కు సహకారం అందించనున్నాయి. Kia India, Mastercard, Project B, Samsung Galaxy ప్రెజెంటింగ్ పార్ట్నర్లుగా, NONGSHIM అసోసియేట్ పార్ట్నర్గా వ్యవహరించనున్నాయి.
HYBE INDIA బిజినెస్ డెవలప్మెంట్ విభాగం అధిపతి సార్థక్ అరోరా మాట్లాడుతూ, “కొన్నేళ్లుగా భారతీయ అభిమానులు K-పాప్‌కు అండగా నిలుస్తూ, మా కళాకారుల సంగీతాన్ని ఆదరిస్తున్నారు. తరతరాలుగా విస్తరిస్తున్న ఈ అభిమానుల సమూహం మా కళాకారులతో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది. కొరియా వెలుపల తొలిసారిగా Weverse Con Festivalను భారత్‌లో నిర్వహించడం ద్వారా ఈ అనుబంధాన్ని మరింత దగ్గర చేయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు తెరపై తమను ఆదరించిన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకోవడానికి మా కళాకారులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కళాకారులపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, విశ్వాసం, నిరంతర మద్దతుకు కృతజ్ఞతగా ఈ ఫెస్టివల్‌ను వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం. కళాకారులు, అభిమానులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, భారతీయ K-పాప్ కమ్యూనిటీకి ప్రత్యేకమైన అనుభూతిని అందించడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశం” అని తెలిపారు.
BookMyShow లైవ్ ఈవెంట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నామన్ పుగాలియా మాట్లాడుతూ, “K-పాప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా, వివిధ దేశాల అభిమానుల నుంచి అసాధారణమైన ఆదరణను పొందుతోంది. ఈ ఫెస్టివల్ లైనప్‌లో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాకారులతో పాటు భవిష్యత్తులో సంగీత రంగాన్ని ప్రభావితం చేయనున్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. HYBE INDIAతో కలిసి సహ నిర్మాతగా, ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న BookMyShow Live.. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫెస్టివల్‌కు ఉన్న గుర్తింపు, నాణ్యత, వైభవానికి అనుగుణంగా భారతీయ ప్రేక్షకులకు ఈ అనుభవాన్ని అందించనుంది. భారతీయ K-పాప్ అభిమానులు సంగీతంతో ఏర్పరచుకున్న ప్రత్యేకమైన అనుబంధానికి తగిన స్థాయిలో ఈ వేడుకను నిర్వహించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
K-పాప్ అగ్రతారల ప్రత్యేక ప్రదర్శనలు
ఈ ఫెస్టివల్లో ENHYPEN తమ ప్రత్యేకమైన సంగీత శైలి, సినిమాటిక్ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనుంది. K-పాప్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన Lee Hyun తన భావోద్వేగభరితమైన గానంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. LE SSERAFIM తమ శక్తివంతమైన ప్రదర్శనలు, వినూత్న సంగీతంతో సందడి చేయనుండగా, TOMORROW X TOGETHER తమ వైవిధ్యభరితమైన సంగీత ఆల్బమ్‌లతో భారతీయ అభిమానులను ఆకట్టుకోనుంది. ఈ కళాకారుల ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా K-పాప్ సంగీతం సాధిస్తున్న ఆదరణకు అద్దం పట్టనున్నాయి.
SEVENTEEN సంగీత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సంగీత నిర్మాత BUMZU ఈసారి సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. Dayoung తన ఆత్మవిశ్వాసం, నిర్భయమైన ప్రదర్శనతో ఆకట్టుకోనుండగా, గతంలో భారత్‌ను సందర్శించి ఇక్కడి అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్న Eric Nam మరోసారి భారతీయ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. Hwasa తన విభిన్నమైన వ్యక్తిత్వం, ఆకట్టుకునే వేదిక ప్రదర్శనతో అలరించనున్నారు.
గ్లోబల్ గర్ల్ గ్రూప్ KATSEYEకు చెందిన Lara కొత్త తరం అంతర్జాతీయ పాప్ ప్రతిభకు ప్రతినిధిగా నిలవనున్నారు. మరోవైపు, Rhea Raj తన ప్రత్యేకమైన మ్యాక్సిమలిస్ట్ సంగీత శైలి, ఉత్సాహభరితమైన ప్రదర్శనతో ఫెస్టివల్‌కు మరింత వైవిధ్యాన్ని తీసుకురానున్నారు.
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ వేదిక
భారతీయ సంగీత రంగంలోని విభిన్న ప్రతిభలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈ ఫెస్టివల్ ప్రత్యేకతను చాటనుంది. Gini, ప్రముఖ హిప్-హాప్ కళాకారుడు King, RANJ X Clifr, Reble, DJ Zelo తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. హిప్-హాప్, ఇండీ, ఎలక్ట్రానిక్ సంగీత శైలులకు ప్రాధాన్యం కల్పిస్తూ, భారతీయ సమకాలీన సంగీత రంగంలోని విస్తృతిని ఈ లైనప్ ప్రతిబింబించనుంది.
టికెట్ల విక్రయాల వివరాలు
ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన టికెట్ల ప్రీ-సేల్ అక్టోబర్ 27, 2026 నుంచి ప్రారంభం కానుంది. Mastercard కార్డుదారులకు ప్రత్యేకంగా ముందస్తు టికెట్ కొనుగోలు అవకాశం కల్పించనున్నారు. సాధారణ టికెట్ల విక్రయాలు అక్టోబర్ 30, 2026 నుంచి ప్రారంభమవుతాయి. అన్ని టికెట్లు భారతదేశంలోని ప్రముఖ వినోద వేదిక BookMyShow ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
టికెట్ల విక్రయాలు, ఫెస్టివల్‌కు సంబంధించిన తాజా సమాచారం, తదుపరి ప్రకటనల కోసం అభిమానులు HYBE INDIA అధికారిక Instagram పేజీ, Weverse Zone Community, BookMyShow Live వేదికలను అనుసరించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న K-పాప్ సంగీతాన్ని భారతీయ సంగీత ప్రతిభతో కలిపి, కళాకారులు, అభిమానుల మధ్య ప్రత్యక్ష అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనున్న Weverse Con Festival India తొలి ఎడిషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.