వెంకట్ నాగం ‘రచ్చబండ చర్చలు’పై డా. సురేంద్ర దారా ప్రశంసలు
సాక్రమెంటో: అమెరికాలోని ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక వేత్త వెంకట్ నాగం రచించిన తాజా వ్యాస సంపుటి ‘రచ్చబండ చర్చలు’ పుస్తకంపై ప్రవాసాంధ్ర సాహితీ లోకం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హవాయిలో నివసిస్తున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, కవి, రచయిత డాక్టర్ సురేంద్ర దారా ఈ పుస్తకంపై సమీక్ష రాస్తూ.. ఇది సమాజానికి అద్దం పట్టే ఒక విశ్లేషణాత్మక వైభవమని కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక చర్చలకు, సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచే ‘రచ్చబండ’ స్ఫూర్తితో రచయిత ఈ పుస్తకాన్ని రాశారని సురేంద్ర దారా తన సమీక్షలో పేర్కొన్నారు. వర్తమాన, చారిత్రక అంశాలను ఎంతో నిశితంగా పరిశీలించి, ఆధునిక సమాజానికి అన్వయించిన తీరు అద్భుతమన్నారు. ముఖ్యంగా భారతదేశ, అమెరికా జీవన విధానాలు, సాంస్కృతిక భిన్నత్వాలను రచయిత ఎంతో సమతుల్యతతో, వాస్తవిక కోణంలో చర్చించారని అభినందించారు.
వివాదాస్పద అంశాలను సైతం సున్నితంగా, గాఢతతో ప్రస్తావించడం వెంకట్ నాగం రచనా పరిణతికి నిదర్శనమని దారా వివరించారు. గతంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై వెంకట్ నాగం చేసిన విశ్లేషణలు ఆయన మేధో పరిధిని చాటాయని, అదే లోతైన విశ్లేషణ, సామాజిక తపన ‘రచ్చబండ చర్చలు’ పుస్తకంలోని ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుందని తెలిపారు.
వంగూరి ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఇటీవలే తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 'నెల నెలా తెలుగు వెలుగు' 96వ అంతర్జాల సదస్సులో డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించారు. ఈ పుస్తకం సాహితీ ప్రియులకు ‘అచ్చంగా తెలుగు’, ‘నవోదయ’ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గ్రంథాలయంలో ఉండాల్సిన పుస్తకం ఇదని, సాహిత్య మిత్రులకు బహుమతిగా ఇవ్వడానికి ఇది చక్కటి ఎంపిక అని సురేంద్ర దారా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వెంకట్ నాగం కలం నుంచి మరిన్ని ఉత్తమ గ్రంథాలు వెలువడాలని ఆకాంక్షిస్తూ ఆయన అభినందనలు తెలిపారు.