Garividi Lakshm: 'గరివిడి లక్ష్మి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

'గరివిడి లక్ష్మి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

'గరివిడి లక్ష్మి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన  జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.''అక్టోబర్ 17న మీ అభిమాన థియేటర్లలో మా గరివిడి లక్ష్మి ఆడి పాడి అలరించబోతోంది' అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.


Garividi Lakshm
TG Vishwa Prasad
Anandhi
Garividi Lakshm release date

Watch Today's Deals on Amazon

More Press News