PremaneOorilo: ప్రేమనే ఊరిలో చిత్రం విజయం సాధించాలి: కామాక్షి..

ప్రేమనే ఊరిలో చిత్రం విజయం సాధించాలి: కామాక్షి భాస్కర్ల

ప్రేమనే ఊరిలో చిత్రం విజయం సాధించాలి: కామాక్షి భాస్కర్ల
మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ బాగుంది. తణికెళ్ల భరణి గారు రిలీజ్ చేసిన పాట కూడా బాగుంది. ఈ ప్రమోషన్స్‌లో నన్ను భాగస్వామిని చేసిన సురేష్ గారికి థాంక్స్. ఈ సినిమాతో శ్రీనివాస్ గారికి మంచి విజయం దక్కాలి. ఆర్టిస్టులు తెరపై అద్భుతంగా కనిపించారు. ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చందు శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ సినిమాతో నిర్మాతగా అడుగు పెడుతున్నాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. దేవేందర్ గారు నాకు బిజినెస్‌లో హెల్ప్ చేశారు. ఆయన వల్లే ఈ సినిమా నాకు తెలిసింది. పోస్టర్ చూసిన వెంటనే నాకు ఎంతో నచ్చింది. టీజర్ చూసిన వెంటనే సురేష్ గారికి ఫోన్ చేశాను. శ్రుతి, దేవేందర్, నేను కలిసి ఈ టీజర్‌ను సురేష్‌కి చూపించాం. అదే రోజు సినిమాని మేమంతా చూశాం. జెన్ జీ ఆడియెన్స్‌ని కూడా మూవీని చూపించాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌కి సినిమా చాలా నచ్చింది. రాంబాబు మాకు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. శ్రీరామ్, రమిక, తపస్విని అద్భుతంగా నటించారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ రేంజ్‌లో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉండమని చందుకి సలహా ఇస్తుంటాను. అయితే ఈ మూవీ గురించి చెప్పినప్పుడు, చూసినప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. మనం  కలిసి ఇకపై జర్నీ స్టార్ట్ చేద్దాం అని చందుతో అన్నాను. ‘ప్రేమనే ఊరిలో’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. శ్రీరామ్, రమిక, తపస్వినిలకు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. కన్నడ, తెలుగులో ఈ సినిమాకి మంచి విజయం దక్కుతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభం తీసుకు వచ్చే సినిమా అవుతుంది. నా ప్రాజెక్ట్‌లోకి సాకేత్ వచ్చాడంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు థాంక్స్. మా ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రం కోసం హైదరాబాద్‌కి రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను చూపిస్తారు. నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ‘ప్రేమనే ఊరిలో’ సోల్ ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. నాక్కూడా ఇక్కడి ప్రేక్షకులు కొంత ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

PremaneOorilo
cinema news

Watch Today's Deals on Amazon

More Press News