జెన్ జీ తరం మెచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ 'అనకాపల్లి' చిత్రంలో ఉన్నాయి: నిర్మాతలు
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు చిత్రానికి సంబంధించిన విషయాల్ని పంచుకున్నారు. వారు చేసిన సంగతులివే..
కాండ్రేగుల నాయుడుతో మీకున్న బంధం గురించి చెప్పండి?
త్రినాథరావు నక్కిన* : నాయుడు అనకాపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇండస్ట్రీలోకి వస్తానని నాతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను మాత్రం వద్దు అని అనేవాడ్ని. చివరకు పట్టుదలతో ఇక్కడకు వచ్చి నిర్మాత అయ్యాడు.
అనకాపల్లి’ కథను ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటి?*
త్రినాథరావు నక్కిన* : ‘అనకాపల్లి’ కథను నేనే రాసుకున్నాను. కానీ తీయకుండా అలా పెట్టేశాను. దర్శకుడిగా జర్నీ మొదలైన తర్వాత సమీకరణాలు మారుతూ వచ్చాయి. అందుకే నా దగ్గర ఉన్న మంచి కథల్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద తీయాలని అనుకుంటున్నాం. దాదాపు ఈ మూవీని కూడా నేనే తీసినట్టు చెప్పుకోవచ్చు. (నవ్వుతూ)
అనకాపల్లిలో షూట్ చేసిన అనుభవం గురించి చెప్పండి?*
కాండ్రేగుల నాయుడు* : మా సొంత ఊర్లో షూట్ చేయడంతో మాకు బాగా కలిసి వచ్చింది. ప్రతీ ఒక్కరూ మాకు సాయం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకెంతో సపోర్ట్ చేసింది. నేచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల అవుట్ పుట్ మరింత ఎఫెక్టివ్‌గా వచ్చింది.
కథా చర్చలో మీ పాత్ర ఎంత ఉంది?*
కాండ్రేగుల నాయుడు* : త్రినాథరావు చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. కథ విన్న వెంటనే ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పేశాను. నేను ఏమీ మార్పులు చేర్పులు చెప్పలేదు.
ఇండస్ట్రీలోని సాధకబాధకాలు త్రినాథరావు గారు చెప్పే ఉంటారు. అవన్నీ తెలిసే వచ్చారా?*
కాండ్రేగుల నాయుడు* : ఓ సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. ఒక బడ్జెట్ పెడుతున్నామంటే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాత్రం మాకు వస్తుంది. అందుకే బ్యానర్లు స్థాపించాం. రెగ్యులర్‌గా సినిమాల్ని నిర్మించాలని అనుకుంటున్నాం.
ఈ సినీ జర్నీ మీకు ఎలా అనిపించింది?*
కాండ్రేగుల నాయుడు* : సొంతూరిలో మా సినిమాని తీయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. మొత్తం 75 లొకేషన్లలో చిత్రీకరించాం. సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది.
‘అనకాపల్లి’లోని మెయిన్ పాయింట్ ఏంటి?*
త్రినాథరావు నక్కిన* : ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఎమోషన్స్ తెలియడం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ తెలియాలని, గుర్తించాలని ఈ మూవీని తీశాం. ప్రస్తుత తరం ఫ్యామిలీ డ్రామాకి కనెక్ట్ అవ్వాలని తీశాం. ఓ సందేశం ఇవ్వాలని అనుకున్నాను. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. యాక్షన్ ఎక్కువగానే ఉన్నా కూడా ఫ్యామిలీ డ్రామానే డామినేట్ చేస్తుంది.
అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాని తీశారా? ఓటీటీ డీల్ పూర్తయిందా?*
త్రినాథరావు నక్కిన* : నేనూ ఓ దర్శకుడినే అవ్వడంతో ఈ సినిమాకి ఎక్కడెక్కడ ఏం అవసరం పడిందో అక్కడక్కడ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లాను. అందులో ఓ పదిశాతం బడ్జెట్ పెరిగింది. ఓటీటీ డీల్ కూడా పూర్తవుతుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు జరుపుతున్నాం. సినిమాని చూసిన తర్వాతే రిలీజ్ చేసేందుకు మైత్రి శశి ముందుకు వచ్చారు.
మీరు ఈ చిత్రంలో చేసిన ఫాదర్ కారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తోంది?*
త్రినాథరావు నక్కిన* : నాకు యాక్టింగ్ వచ్చు. ప్రతీ దర్శకుడిలో ఓ నటుడు ఉంటాడు. దర్శకుడు, హీరో అందరూ కలిసి నన్ను ఒప్పించారు. నాకు పొట్ట ఉన్నా కూడా ఇంకా పొట్ట కావాలని మా దర్శకుడు అనేవాడు (నవ్వుతూ). అందుకే ప్రతీ రోజు సెట్‌కి వెళ్లేటప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని (నవ్వుతూ). ఇంద్రజ గారు, విక్రమ్, సంధ్య అద్భుతంగా నటించారు. అసలు ఇందులోని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ పోటీ పడుతూ నటించారు.
ఆగస్ట్ 7న గట్టి పోటీ ఉంది కదా?
త్రినాథరావు నక్కిన* : ముందు మేం ఆగస్ట్ 7న ఫిక్స్ అయ్యాం. అప్పుడు ఈ చిత్రాలన్నీ లేవు. అయితే ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక సినిమా పోటీలో ఉంటుంది. మాకు మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. మా నాయుడు కూడా సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఆగస్ట్ 7న రావాలని నిర్ణయించుకున్నాం.
దర్శకుడి గురించి చెప్పండి?
త్రినాథరావు నక్కిన* : ఖగేష్ నాకు పదేళ్ల నుంచి తెలుసు. నాకు తమ్ముడిలాంటివాడు. అతనితో నాకు మంచి ర్యాపో ఉంటుంది. ఖగేష్ ఈ మూవీని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.
మీ ఇద్దరూ కలిసే సినిమాల్ని చేస్తారా?
కాండ్రేగుల నాయుడు* : నాది, త్రినాథరావుది ఒకే ఊరు. హైదరాబాద్‌లోనే ఉన్నా.. అతని మనసు మాత్రం మాతోనే, మా ఊర్లోనే ఉంటుంది. నేను నా జర్నీని త్రినాథరావుతో కంటిన్యూ చేస్తాను. మంచి కథలు వస్తే సొంతంగానూ, ఇతర బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తాను.
అనకాపల్లి’ సినిమా ఎలా ఉండబోతోంది?
కాండ్రేగుల నాయుడు* : ‘అనకాపల్లి’ చిత్రంలో ఓ అందమైన కథ ఉంది. ఇందులో యాక్షన్‌తో పాటుగా కుటుంబ విలువలు చెప్పే గొప్ప సందేశం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
త్రినాథరావు నక్కిన* : ‘నేను రెడీ’ పూర్తయింది. రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ప్రస్తుతం దర్శకుడిగా కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేశాను. నిర్మాతగా సినిమాలు వెంటనే రావు. కాస్త గ్యాప్ ఉంటుంది. ‘ధమాకా’ని మించిన కథ, స్క్రిప్ట్ కుదిరితేనే ‘ధమాకా-2’ గురించి ఆలోచిస్తాను.