ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో కొత్తదనం ఉన్నలవ్‌స్టోరీస్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో దర్శకులు తమ సినిమా ప్రేమకథలను అందర్ని షాకింగ్‌కు గురిచేసే ట్విస్ట్‌లతో తెరకెక్కించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లను వినూత్నంగా, హృదయాలను కదిలించే విధంగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవలో వచ్చిన మరో వినూత్న ప్రేమకథే 'దివానా' మొదట్నుంచీ ఈ చిత్రం మీ హృదయాలను హత్తుకుంటుంది.. మీ గుండెలు పిండేస్తుంది అంటూ చెబుతున్నారు 'దివానా' మేకర్స్. ఇక ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ ప్రేమకథలో ప్రేక్షకులు అంగీకరించే అంశాలున్నాయా? ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా పర్‌ఫార్మ్ చేస్తుందో రివ్యూలో తెలుసుకుందాం..
మున్నా (హర్షిత్ రెడ్డి) డిగ్రీ వరకు చదువుకుంటాడు. కానీ ఉద్యోగం చేయాలనే ఆలోచన కూడా లేకుండా, తల్లిదండ్రుల ( వీకే నరేష్, ఝాన్సీ)పైనే ఆధారపడుతూ బస్తీ దోస్తులతో తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఏ మాత్రం బాధ్యత లేకుండా గ్యాంగ్, ఫైట్స్ అంటూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలాంటి మున్నా అనుకోకుండా మీ సేవలో పనిచేస్తున్న అమ్ము (స్నేహ మణి మేఘలై) ను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పెళ్లి అంటూ చేసుకుంటే అమ్మునే చేసుకోవాలని ఫిక్సయిపోతాడు. అమ్ము కంటే ప్రపంచంలో అందమైన అమ్మాయే లేదని నిర్ణయించుకుంటాడు.
ఆ రోజు నుంచి రోజు మీసేవలో ఏదో ఒక బిల్లు కట్టే నెపంతో మీసేవకు వెళ్లి అమ్మును చూస్తుంటాడు.. ఆమెతో మాట్లాడుతుంటాడు. ఒకరోజు అమ్ముతో తన ప్రేమ విషయం చెబుతాడు. అమ్ముకు మాత్రం మున్నా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా ఆమెపై ఉన్న ప్రేమ తగ్గదు. మున్నా ప్రయత్నం ఆగదు. దీంతో మున్నాను డైవర్ట్ చేయడానికి 'ప్రభుత్వ ఉద్యోగం సంపాందించి రా' అప్పుడు నీ ప్రేమ గురించి ఆలోచిస్తా అని చెబుతుంది. దీంతో మున్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ మధ్య కాలంలోనే ఓ గొడవ కారణంగా మున్నా పోలీస్‌స్టేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? మున్నా ప్రేమను అమ్ము అంగీకరించిందా? నిజంగానే అమ్ముకు మున్నా అంటే ఇష్టం లేదా? మున్నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? మున్నా పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళాతాడు? ఇవన్నీ కథలోని ముఖ్యంశాలు.
కథగా చెప్పుకుంటే ఇది రెగ్యులర్ ప్రేమకథలాగానే అనిపిస్తుంది. అయితే కథ చుట్టు బలమైన భావోద్వేగాలు, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దర్శకుడు చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే సినిమాను సక్సెస్‌ఫుల్ జర్నీవైపే తీసుకెళ్లాడు. ఈ ట్రెండ్ కథల తరహాలనే ఇంటర్వెల్, పతాక సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి వాటిని రెగ్యులర్‌గా భిన్నంగా ప్రజెంట్ చేశాడు. కేవలం ప్రేమపైనే కాకుండా, స్నేహాం, కుటుంబ భావోద్వేగాల అంశాలకు కూడా దర్శకుడు ప్రాముఖ్యత నివ్వడం ఈ సినిమా ప్లస్ పాయింట్స్. స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.వీటితో పాటు కొడుకు, తండ్రిల మధ్య ప్రేమను కూడా ఎమోషనల్‌గా ఆవిష్కరించడానికి ప్రయత్నించారు.
ఇంటర్వెల్‌లో వచ్చే షాకింగ్ ట్విస్టే ఈ సినిమాకు ప్రధాన బలం. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న ప్లేస్‌కు వెళ్లే సీన్స్ మళ్ళీ మళ్లీ చూస్తున్న ఫీల్‌తో కొన్నిసార్లు బోర్ కొడుతుంది. ఫస్టాఫ్ స్లోగా ఉన్నా.. ఫ్రెండ్స్ బ్యాచ్ చేసే హంగామాతో కథనంలో స్పీడ్ పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ఉద్యోగం సంపాందించడం కోసం పడిన కష్టాలు, ఆ తరువాత జరిగే పరిణామాలు, పతాక సన్నివేశాలతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం నిడివి పెరిగిన భావనను కలిగిస్తుంది. ప్రేక్షకులను కథలో మరింత ఇన్‌వాల్వ్ చేయడానికి, వారిలో ఓ ఫీల్‌గుడ్ మూమెంట్ కలిగించడానికి దర్శకుడు పతాక సన్నివేశాల నిడివి పెంచినట్లుగా అనిపించింది. అయితే మొదట్నుంచీ కథతో, క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అయ్యే ప్రేక్షకులకు ఇది పెద్ద ఇబ్బందేమీ కాదు. ఓవరాల్‌గా 'దివానా' పతాక సన్నివేశాలు అందరి హృదయాలను మాత్రం బరువెక్కిస్తుంది.
హీరో హర్షిత్ రెడ్డి నటన గురించి ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సిందే. మున్నా పాత్రలో హర్షిత్ రెడ్డి నటన అలరిస్తుంది. తెలుగు చిత్ర సీమకు హర్షిత్ రెడ్డి రూపంలో మరో మంచి నటుడు దొరికినట్లేనని అతని నటన నిరూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో హర్షిత్ రెడ్డి మంచి ప్రతిభను చూపాడు. కథానాయిక స్నేహ తన పరిథి మేరకు చక్కని నటనను కనబరిచింది. అమ్ము పాత్ర ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కథానాయకుడి స్నేహితులుగా నటించిన వాళ్లు ఎంతో సహజంగా నటించారు. బస్తీ కుర్రాళ్లు అంటే ఇలాగే ఉంటారు అనే రీతిలో వారి నటన ఉంది.
కథానాయిక స్నేహితురాలు పాత్ర కూడా మెప్పిస్తుంది. తండ్రి వీకే నరేష్, తల్లిగా ఝాన్నీ తమ పాత్రలకు న్యాయం చేశారు. బలగం వేణు, రఘు పాత్రలు నిడివి తక్కువైనా గుర్తుండిపోయే పాత్రలు అవి. ఫోటోగ్రఫీ, పాటలు సినిమాకు మరింత వన్నెను తెచ్చాయి. దర్శకుడు తొలిచిత్రమైనా ఎక్కడా తడబడకుండా, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం.
వన్‌సైడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ 'దివానా' ప్రేమకథ అందరి హృదయాలను హత్తుకుంటుంది. అయితే ఇలాంటి డిఫరెంట్ అండ్ ఎక్స్‌పర్‌మెంట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులు ఆదరించే దానిపైనే ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లు, కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంది.
'దీవానా' మూవీ రివ్యూ
Deewana Review
Movie Details
Movie Name: Deewana
Release Date: 2026-06-19
Cast: Harshith Reddy, Smeha Manimegalai, vk naresh, jhansi
Director: Srikanth Sangishet
Music: Eshwar Chand
Banner: Arha Media, V Studios banne
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer