టాలీవుడ్లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం!
- ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం
- సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం
- పెద్ది సినిమాకు పర్సంటేజీ విధానమే కోరుతున్న ఎగ్జిబిటర్లు
ఈరోజు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్యల్లో ఎటువంటి ఏకాభిప్రాయం రాలేదు. వారి మధ్య సయోధ్య కుదరలేదు. పెద్ది సినిమాకు తమకు కచ్చితంగా పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజ్ కొద్దిగా తక్కువగా ఇచ్చినా పర్వాలేదని, కానీ రెంట్ మాత్రమే ఇస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.