విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్... బీజేపీ నేతలు ఖుష్బూ, కస్తూరి కీలక వ్యాఖ్యలు
- 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన ఖుష్బూ సుందర్
- ప్రజలు ఎవరినైతే సీఎంగా కోరుకున్నారో వారినే నియమించాలన్న ఖుష్బూ
- తమిళనాడు పౌరురాలిగా అదే కోరుకుంటున్నానని వ్యాఖ్య
ఈ క్రమంలో ఖుష్బూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రజలు ఎవరినైతే ముఖ్యమంత్రిగా కోరుకున్నారో వారిని నియమించాలని పేర్కొన్నారు. తమిళనాడు పౌరురాలిగా ఈ మేరకు కోరుకుంటున్నానని తెలిపారు. అంతకుముందు సినీ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి కూడా విజయ్‌కు మద్దతు పలికారు.
ప్రజలు విజయ్‌కి అనుకూలంగా ఓటు వేశారని, అందుకే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు. వారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్‌కి అవకాశమివ్వాలని అన్నారు. జాప్యం చేయాలని చూస్తే తమిళనాడు ప్రజలు, ఇతర ప్రాంతాల వారు కూడా కుట్రగా భావించవలసి వస్తుందని హెచ్చరించారు. వారు నేరుగా బీజేపీనే నిందిస్తారని పేర్కొన్నారు. విజయ్ మార్గంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకినైనా, అది నిజం కాకపోయినా, రాజ్యాంగపరమైన జాప్యంగా కాకుండా, కేవలం బీజేపీ ఆడుతున్న ఆటగా మాత్రమే చూస్తారని కస్తూరి పేర్కొన్నారు.