ఆర్టీసీ సిబ్బంది గొడవలు పెట్టుకోవద్దు: పొన్నం ప్రభాకర్ హితవు
- అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని సూచన
- ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నమంత్రి
- నష్టాల్లో ఉన్న డిపోలు సమీక్షించుకోవాలన్న మంత్రి
ఖమ్మం, మెదక్, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లెందు లాంటి కొన్ని డిపోలు ఎందుకు నష్టాల్లో నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్‌లు సమీక్షించాలని ఆదేశించారు. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది సమస్యలు సావధానంగా వినాలని సూచించారు. టిక్కెట్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు, సమస్యలు ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.