విజయ్, త్రిష వ్యవహారంపై స్పందించిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ
- వీరి విషయంలో ప్రజలకు ఏం ఆసక్తి అనేది అర్థం కావడం లేదన్న ఖుష్బూ
- అది వారి వ్యక్తిగత విషయమన్న ఖుష్బూ
- దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారని ప్రశ్న
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఖుష్బూ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్, త్రిష అంశం తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీపై ప్రభావం చూపుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఖుష్బూ స్పందిస్తూ, ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు.