ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. కుమారుడి వివాహానికి ప్రత్యేక ఆహ్వానం
- ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి భేటీ
- కుమారుడి వివాహ వేడుకకు రావాలని ప్రత్యేక ఆహ్వానం
- క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వక సమావేశం
- మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న వివాహ వేడుక
భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు.
ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వకంగానే జరిగిందని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. తన కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని చంద్రబాబును భట్టి విక్రమార్క కోరారు.
