వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు
- తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ
- వైఎస్ భారతితో పాటు బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు నోటీసులు
- తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో రఘురామ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు, నష్టపరిహారంగా తనకు కోటి రూపాయలు ఇవ్వాలని... ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రఘురామ నోటీసులకు వైఎస్ భారతి, ఇతరులు ఎలా స్పందింస్తారో వేచిచూడాలి.