ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్!
- బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు దక్కించుకోవడంతో ఛైర్మన్‌గా ఎన్నికైన సుదర్శన్ రెడ్డి
- 19వ వార్డు కౌన్సిలర్ అదృశ్యం కావడంపై హైకోర్టులో పిటిషన్
- యథాతథ స్థితిని కొనసాగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అయితే, 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడంతో ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని ఎల్లుండి తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే అందే సమయానికి సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దాంతో, హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.