తిలక్ వర్మపై గంభీర్ అసహనం!
- పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడుతూ అభిమానులను నిరాశపర్చిన తిలక్ వర్మ
- తిలక్ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
- వేగంగా ఆడాలని, స్కోరు 170 దాటేలా టార్గెట్ పెట్టాలని సూచించిన గంభీర్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్.. తిలక్ వర్మతో చాలా సీరియస్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది. వేగంగా ఆడాలని, స్కోరు 170 దాటేలా టార్గెట్ పెట్టాలని గంభీర్ గట్టిగా సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తిలక్ కొంత ఇబ్బంది పడ్డాడు. చివరికి 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తిలక్ స్ట్రైక్‌రేట్ 104.17గా నమోదైంది.