ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు
- గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం
- ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ
గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్ లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసినవారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.