మక్తల్ అభ్యర్థి ఆత్మహత్య... డీజీపీ ఆఫీసును ముట్టడించిన బీజేపీ
- డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
- బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
- తోపులాట జరగడంతో పలువురికి గాయాలు
పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.