ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్
- సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామన్న మంత్రి
- కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని వెల్లడి
- నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహం ఏర్పాటు అంశంపై త్వరలో సీఎం నిర్ణయం తీసుకుంటారన్న మంత్రి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఇక, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే చర్చించామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈతరం కవులు సమర్పించిన కవితా హారతిగా ఈ కార్యక్రమం నిలిచిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 51 మంది కవులు కవితలు వినిపించడంతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.