సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం దిల్ రాజు మాతో మాట్లాడుతుంటారు: మల్లు భట్టి విక్రమార్క
- సినీ రంగ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తుంటారన్న ఉప ముఖ్యమంత్రి
- టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా ప్రభుత్వం చేస్తుందని హామీ
- గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు బాధ్యతాయుతంగా తీసుకున్నారని వ్యాఖ్య
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలనేది తమ ప్రభుత్వం సంకల్పమని అన్నారు. ఈ మేరకు బ్లూప్రింట్ సిద్ధం చేశామని తెలిపారు.
సినిమా రంగం ద్వారా సామాజిక సందేశాలు ఇవ్వడంతో పాటు వాణిజ్య పరంగా లబ్ధి పొందవచ్చని అన్నారు. చిత్ర పరిశ్రమ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలిపారు. పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రత్యేకంగా చెప్పమన్నారని తెలిపారు. వారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున వారి తరఫున చెబుతున్నానని అన్నారు. గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు ఓ బాధ్యతగా స్వీకరించారని అన్నారు.