నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీలో సందడి చేసిన శ్రీలీల
- అరిచి అరిచి గొంతు పోయిందన్న శ్రీలీల
- డ్యాన్స్ చేయమని యువకులు కోరగా సానుకూలంగా స్పందిచిన వైనం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
పెళ్లి సందD మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన శ్రీలీల తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తుండగా, హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లోనూ కనిపించనుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మూవీలో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకుంది.