హైదరాబాద్లో చిన్నారి ప్రాణాలు తీసిన చైనా మాంజా
- కూకట్పల్లిలో మాంజా కారణంగా ఐదేళ్ల బాలిక మృతి
- ఇద్దరు కుమార్తెలతో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఘటన
- బాలిక మెడకు చుట్టుకుని కిందపడి అక్కడికక్కడే మృతి
చైనా మాంజా సాధారణ నూలు దారం కాదు. ఇది నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారవుతుంది. దానిపై గాజు ముక్కల పొడిని పూస్తారు. ఈ దారం పక్షుల రెక్కలను, మనుషుల నరాలను కోసేంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇది తెగిపోయి ఎక్కడైనా చిక్కుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ, కొందరు రహస్యంగా విక్రయిస్తున్నారు.