గణతంత్ర వేడుకల్లో హిస్టారికల్ ప్రారంభం.. తొలిసారి ఆర్మీ జంతు బృందం కవాతు
- జనవరి 26న గణతంత్ర వేడుకలో యానిమల్ కంటిజెంట్
- కవాతులో ఒంటెలు, గొర్రాలు, డేగలు, ఆర్మీ జాగిలాలు
- కవాతు బృందంలో భద్రత కోసం సైనికులు ఉపయోగించే జంతువులు
రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్వీసీ) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద భద్రత కోసం సైనికులు ఉపయోగించే జంతువులు ఈ బృందంలో ఉన్నాయి.
లడఖ్‌లోని శీతల ఎడారులలో కార్యకలాపాల కోసం ఇటీవల చేరిన బాక్ట్రియన్ ఒంటెలు ఈ కవాతులో నాయకత్వం వహించనున్నాయి. విపరీతమైన చలి, 15,000 అడుగుల కంటే ఎత్తులో అసాధారణ పరిస్థితుల్లో ఈ ఒంటెలు 250 కిలోల వరకు బరువును మోయగలవు. అదే సమయంలో తక్కువ నీరు, ఆహారంతో ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు.