ఆలయంలో ప్రదర్శనకు వచ్చి.. మెట్లపై జారిపడి యువ కళాకారిణి మృతి
- కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో ఘటన
- కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన బృందం
- మెట్లు దిగుతుండగా కాలుజారి కిందపడిన 17 ఏళ్ల భవ్యశ్రీ
- తలకు తీవ్ర గాయం కావడంతో మృతి
భవ్యశ్రీ వేసుకున్న ఎత్తైన పాదరక్షల కారణంగానే ఆమె పట్టు కోల్పోయినట్టు తోటి కళాకారులు చెబుతున్నారు. అయితే, ఆ మెట్లకు కనీస రక్షణ గోడ కూడా లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె సోదరి పాలపర్తి మధు ఆరోపించారు. ఈ బృందంలో మృతురాలితోపాటు దాదాపు అందరూ మైనర్లే కావడం గమనార్హం. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.