ఓటీటీకి 'రాజు వెడ్స్ రాంబాయి'
- నవంబర్ 21న విడుదలైన సినిమా
- విలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమకథ
- థియేటర్స్ నుంచి దక్కిన హిట్ టాక్
- ఈ నెల 19 నుంచి ఈటీవీ విన్ లోకి
ఇక ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన తేజస్వీ రావు, యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆమె నవ్వుకు .. నటనకు చాలామంది అభిమానులుగా మారిపోయారు. అందునా ఇది లవ్ స్టోరీ కావడంతో యూత్ అంతా థియేటర్స్ లో సందడి చేశారు. ఫలితంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన సినిమాల జాబితాలో చేరిపోయింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, రాజు పేదింటి కుర్రాడు. అతను అదే గ్రామానికి చెందిన రాంబాయిని ప్రేమిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న యువకుడితో తన కూతురు పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో ఆమె తండ్రి ఉంటాడు. అయితే రాంబాయిని గర్భవతిని చేస్తే, తనతోనే ఆమె పెళ్లి జరిపిస్తారని భావించిన రాజు, అలాగే చేస్తాడు. ఫలితంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.