కేంద్ర మంత్రి సురేశ్ గోపి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
- సురేశ్ గోపిపై త్రిస్సూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్
- మంత్రి, మేయర్ కూడా ఆయనను కలవలేకపోతున్నారన్న గోకుల్
- బీజేపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న గోకుల్
రెండు నెలల నుంచి సురేశ్ గోపి కనిపించడం లేదని... రెవెన్యూ మంత్రి, త్రిస్సూర్ మేయర్ కూడా ఆయనను కలవలేకపోతున్నారని గోకుల్ అన్నారు. సురేశ్ గోపి ఆచూకీ గురించి ఆయన కార్యాలయ సిబ్బందిని అడిగినా... ఆయన ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తారో చెప్పడం లేదని తెలిపారు. అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి కనిపించకపోవడంపై బీజేపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.