క్రికెట్ కామెంటరీ బాక్సులో గూగుల్ సీఈవో..వీడియో ఇదిగో
- భారత్ – ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ కు హాజరైన గూగూల్ సీఇఓ సుందర్ పిచాయ్
- కామెంటరీ బాక్స్‌లో సందడి చేసిన సుందర్ పిచాయ్
- తాను చిన్నతనం నుంచే క్రికెట్ అభిమానినన్న సుందర్ పిచాయ్
వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో కలిసి సుందర్ పిచాయ్ కొద్దిసేపు కామెంటరీ కూడా అందించారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను, క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చిన్నతనం నుంచే క్రికెట్ అభిమానినని ఆయన అన్నారు.
తన బెడ్‌రూమ్ గోడలపై సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పోస్టర్లు ఉండేవని సుందర్ పిచాయ్ తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో తన అభిమాన క్రికెటర్లు అవుట్ కావడం తట్టుకోలేకపోయేవాడినని, అందుకే లైవ్ మ్యాచ్‌లు చూడటం చాలా తక్కువ అని వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.