ఏపీలో తుంగభద్ర నది నుంచి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
- కర్ణాటక నుంచి మంత్రాలయం వచ్చిన భక్తులు
- తుంగభద్ర నది వద్ద ఫొటోలు తీసుకుంటూ ప్రవాహంలో చిక్కుకున్న వైనం
- మృతులు కర్ణాటకకు చెందిన డిగ్రీ విద్యార్థులు
కర్ణాటక నుంచి ఏడుగురు భక్తుల బృందం శుక్రవారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి చేరుకుంది. వారు హోటల్ నుంచి బయలుదేరి నది ఒడ్డుకు వెళ్లారు. బలమైన నీటి ప్రవాహంలో చిక్కుకుని వారిలో ముగ్గురు భక్తులను కొట్టుకుపోయారు. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించినా, భారీ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం గాలింపు చర్యలు తిరిగి ప్రారంభం కాగా, వారి మృతదేహాలు లభ్చమయ్యాయి. మరణించిన వారు కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని జవగల్లుకు చెందిన డిగ్రీ విద్యార్థులుగా గుర్తించారు.