విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు
- రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యలపై ఫిర్యాదు
- గిరిజనులను కించపరిచేలా మాట్లాడారని సంఘాల ఫైర్
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు
తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.