తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ
- 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ
- అంబేద్కర్, రోహిత్ వేముల ఎదుర్కొన్న వివక్ష మరెవరూ ఎదుర్కోకూడదన్న రాహుల్ గాంధీ
- రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసిన రాహుల్ గాంధీ
ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు 'రోహిత్ వేముల' చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ రాశారు.