నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవ్ .. అదంతా పుకారే: హీరో సంపూ
- నా భార్య మిషన్ కుడుతుంది
- నా పిల్లలు చాలా సింపుల్
- అందువల్లనే ఆ ప్రచారం జరిగింది
- అందులో నిజం లేదని చెప్పిన సంపూ
సినిమాలలో నాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయలేకపోయానని అనిపిస్తూ ఉంటుంది. నా భార్య ఉమారాణి మిషన్ కుడుతుంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. బీటెక్ .. ఇంటర్ చదువుతున్నారు. నరసింహాచారి పిల్లలుగానే వాళ్లు సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ నా పేరును బయటికి రానీయరు. నాకు మాదిరిగానే బస్సులలో .. ఆటోలలో కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్లు అలా ఉండటమే నాకు కూడా నచ్చుతుంది" అని చెప్పాడు.
నేను నాలుగైదేళ్లు తెరపై కనిపించకపోవడం వలన, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాననే ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను సినిమాలు చేశాను. అయితే అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడం వలన అలాంటి ప్రచారం జరిగింది. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు" అని అన్నారు.