చిన్నారి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు
- సిద్దిపేటలో విద్యార్థుల కోసం ;భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే కార్యక్రమం
- ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి
- ఓ విద్యార్థిని ఎమోషనల్ మాటలకు హరీశ్ రావు కంటతడి
ఓ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని, తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీశ్‌రావుతో పాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని, వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఓదార్చారు.