పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై అనుచిత వ్యాఖ్యలు... నిందితుడి అరెస్టు
- కర్నూలు జిల్లాకు చెందిన రఘును అరెస్టు చేసినట్లు చెప్పిన గుంటూరు ఎస్పీ
- హీరోల అభిమానుల సోషల్ మీడియా పోరులో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడి
- రఘుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడి
హీరోల అభిమానుల సోషల్ మీడియా పోరులో భాగంగానే రఘు అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడు ఐదు మొబైల్స్‌ను వినియోగించాడని, 14 మెయిల్ ఐడీలను ఉపయోగించి 'ఎక్స్'లో ఖాతాలు తెరిచాడని వెల్లడించారు.
రఘు చేసిన పోస్టులను పరిశీలించామని, వాటిలో ఎక్కువగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.