తెలంగాణ లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి నియామకం
- ఉప లోకాయుక్తగా జగ్జీవన్ కుమార్ నియామకం
- హెచ్ఆర్సీ చైర్ పర్సన్‌గా షమీమ్ అక్తర్ నియామకం
- నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 5వ తేదీన సచివాలయంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను పరిశీలించి వీరి పేర్లను ఖరారు చేసింది.