సీఐడీ విచారణకు హాజరైన జోగి రమేశ్
- చంద్రబాబు ఇంటిపై దాడి కేసు
- 2021లో తన అనుచరులతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడి
- ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరైన జోగి రమేశ్
2021లో చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీనిపై తాడేపల్లి పీఎస్ లో కేసు నమోదయింది. ఆ కేసులను కూటమి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. జోగి రమేశ్ ను ఇప్పటికే సీఐడీ రెండు సార్లు విచారించి పంపించేసింది. ఈరోజు మూడోసారి విచారణకు పిలిచింది. సీఐడీ కేసు నమోదైనప్పటి నుంచి జోగి రమేశ్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. మీడియా ముందుకు కూడా రావడం లేదు.