పిఠాపురంలో నూతన రోడ్లను ప్రారంభించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు
- ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన
- ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు నూతన రోడ్లను ప్రారంభించిన నాగబాబు
- ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న పలువురు జనసేన పార్టీ నేతలు
ఇవాళ ఉదయం పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్-1లో రూ. 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును నాగబాబు... శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.